08/11/2026, Sunday · 03:00:14 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో అనుమానితుడి అరెస్ట్

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 11:09 AM అంతర్జాతీయం 6

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో అనుమానితుడి అరెస్ట్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అక్కడి భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడి వాహనంలో తనిఖీ చేసి 3 తుపాకులు, పెద్దసంఖ్యలో తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతణ్ని విచారించగా.. ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేయాలంటూ తన మది పదే పదే ప్రేరేపించిందని అతడు చెప్పినట్టు తెలుస్తోంది.నిందితుణ్ని రోన్నీ యోర్డ్రిక్స్‌ గ్వానిపా క్రినోస్‌గా గుర్తించారు అధికారులు. అతడు వెనెజువెలాకు చెందిన వలసదారుడని, అమెరికాలో అక్రమంగా ఉంటున్నాడని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది. 2024 మార్చిలో టెక్సాస్‌ మార్గం ద్వారా యూఎస్‌లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. ప్రస్తుతం అతడు యూఎస్‌ మార్షల్స్‌ సర్వీస్‌ అదుపులో ఉన్నాడు. మరోవైపు.. అతడు ఉపయోగిస్తున్న వాహనం కూడా ఇప్పటికే చోరీకి గురైనట్టు ఫిర్యాదు నమోదైందని గుర్తించారు.

ఈ ఘటనపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి మార్క్‌వేన్‌ ముల్లిన్‌ స్పందిస్తూ.. సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం తప్పిందని ప్రశంసించారు. నిందితుడు ఎవరినీ హానిచేయకముందే పట్టుకున్నారని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై శ్వేతసౌధం నేరుగా స్పందించకుండా.. వివరాల కోసం హోంల్యాండ్‌ సెక్యూరిటీ, సీక్రెట్‌ సర్వీస్‌ విభాగాలను సంప్రదించాలని సూచించింది.

కాగా.. యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనతోపాటు కుటుంబ సభ్యులపై బెదిరింపులకు సంబంధించిన పలు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం సమీపంలో ఆయుధాలతో అనుమానితుడు పట్టుబడటం అమెరికా భద్రతా వర్గాల్లో కలకలం రేపింది.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

Suspect arrestedConspiracykillTrumprifles

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు