08/11/2026, Sunday · 03:00:12 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రేషన్‌ బియ్యం పంపిణీలో గోల్‌మాల్‌

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 12:36 PM వరంగల్ 8

రేషన్‌ బియ్యం పంపిణీలో గోల్‌మాల్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • తూకం వేయకుండానే సరఫరా చేస్తున్న ఇన్‌చార్జులు
  • బస్తాకు 6-7కిలోలు తక్కువగా వస్తున్నాయంటున్న డీలర్లు
  • గోదాం ఇన్‌చార్జుల చేతివాటం..

వరంగల్‌: తూకాల్లో మోసం చేసిన రేషన్‌ డీలర్లను సస్పెండ్‌ చేస్తున్న అధికారులు ఆ తప్పు తమ వద్ద జరుగుతున్నప్పటికీ కట్టడి చేయడంలేదు. ఒక్కోబస్తాలో 6-7 కిలోలు తక్కువ ఉండటంతో డీలర్లు నష్టపోతున్నారు. మిల్లింగ్‌ దగ్గరే ఈ మోసం జరుగుతుండగా అధికారులు ఆ తప్పును డీలర్లపై వేసి చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనల ప్రకారం స్టేజీ-1 గోదాములకు వచ్చిన బియ్యాన్ని స్టేజ్‌-2 గోదాములలో నిల్వచేసుకొని అక్కడ నుంచి డీలర్లకు అందించాలి. అది కూడా డీలర్‌ వేలిముద్ర(బయోమెట్రిక్‌) తీసుకున్నాకే బియ్యం బస్తాలను తూకం వేసి లారీలో లోడింగ్‌ చేసి పంపించాలి.కానీ, అందుకు విరుద్ధంగా గోదాము వద్దకు డీలర్‌ వెల్లకముందే డీలర్‌కు ఫోన్‌చేసి మీకు ఓటీపీ వచ్చింది చెప్పండని గోదాముల ఇన్‌చార్జులు అడుగుతున్నారు. ఓటీపీ ఏంటని ప్రశ్నిస్తే బియ్యం ఎప్పుడు వస్తాయోనన్న భయంతో డీలర్లు ఓటీపీ చెబుతున్నారు. దీంతో డీలర్‌ లేకుండానే.. తూకం వేయకుండానే డీలర్లకు బియ్యం పంపిస్తున్నారు. అలా వచ్చిన బియ్యాన్ని డీలర్లు తూకం వేస్తే ఒక్కో బస్తాలో 6నుంచి 7 కిలోలు తక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రజలకు పంపిణీ చేస్తున్న సమయంలో తక్కువ తూకం వేస్తున్నారని తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, తమ మాట వినని వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.50కిలోల బియ్యం బస్తాలు లారీలలో లోడింగ్‌ అన్‌లోడింగ్‌ చేసే సమయంలో కొంత తరుగు పోతుంది. అది మిల్లింగ్‌ అయినప్పటి నుంచి డీలర్‌ షాప్‌కు చేరేవరకు ఒక బస్తాకు కనీసం 2కిలోల బియ్యం లోటు ఉంటుంది. కాని ఇటీవల డీలర్లకు పంపిణీ చేసిన బస్తాల్లో 6-7 కిలోలు తక్కువగా ఉంటున్నాయి. ఆలోటును పూడ్చడానికి డీలర్లకు స్టేజ్‌-2 గోదాముల నుంచి బియ్యం తూకం వేసి లారీల్లో లోడింగ్‌ చేసినప్పుడే ప్రతి 100 క్వింటాళ్ల బియ్యానికి 2 క్వింటాళ్ల బియ్యం అనదంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే డీలర్‌ గోదాముకు రాకుండానే తూకం వేయకుండానే ఓటీపీ విధానంలో బియ్యం రేషన్‌షాపులకు పంపించడం ద్వారా డీలర్లకు ఇవ్వాల్సిన అదనపు బియ్యాన్ని గోదాముల ఇన్‌చార్జులు నొక్కెస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

తూకంలో తేడాలు వస్తే డీలర్లపై కేసులు పెడుతున్న జిల్లా అధికారులు గోదాముల వద్ద తూకాల్లో మోసాలకు పాల్పడేవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీలర్లు ప్రశ్నిస్తున్నారు.కాగా, గత ఆగస్టులో మూడునెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన తర్వాత నవంబరు నెల బియ్యం పంపిణీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. జిల్లాలో 509 రేషన్‌షాపులు ఉండగా 15రోజుల ముందే రేషన్‌షాపులకు బియ్యం సరఫరా చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

rice distributionGoalmallration

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు