08/11/2026, Sunday · 03:00:09 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మహిళా సంఘాలకు డ్రోన్లు

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 1:09 PM కరీంనగర్ 8

మహిళా సంఘాలకు డ్రోన్లు
Want this news as a newspaper clip?Print News Clip
  • గ్రామీణ మహిళల కోసం నమో డ్రోన్‌ దీదీ పథకం
  • రైతులకు సాంకేతికతను చేరువచేయడమే లక్ష్యం
  • డ్రోన్‌ సేవలు

చొప్పదండి(కరీంనగర్): డిజిటల్‌ వ్యవసాయంలో భాగంగా గ్రామీణ మహిళల ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్‌ దీదీ పథకాన్ని తీసుకువచ్చింది. వ్యవసాయ ఆధారిత ఉపాధి మార్గంగా మహిళలు జీవితాల్లో మార్పు తేవడంతో పాటు ఆధునిక సాంకేతికతను రైతులకు చేరవేడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మహిళా సాధికారిత, వ్యవసాయం లో ఆధునికత, నైపుణ్య అభివృద్ధితో పాటు గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి డ్రోన్‌ దీదీ నూతన అవకాశాలను కల్పిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు దరఖాస్తు చేసుకోవచ్చు.

సబ్సిడీపై అందే డ్రోన్లతో ఎస్‌హెచ్‌సీ గ్రూపులు వ్యవసాయంలో రైతులకు సహా యకారిగా పనిచేస్తాయి. ప్రతియేటా కనీ సం లక్ష రూపాయల ఆదాయాన్ని పొం దుతాయి. పంట పొలాలపై ఎరువులు, పురుగు మందుల పిచికారితో పాటు పంట సర్వేలు, మ్యాపింగ్‌, డేటా అనాలసిస్‌ లాంటి పనులను డ్రోన్‌ ద్వారా సంఘాల సభ్యులు నిర్వహిస్తారు. వ్యవసాయాధారిత డ్రోన్‌ ద్వారా సంఘాలకు ఆదాయంతో పాటు మహిళల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయి.

ప్రస్తుతం పంట పొలాలకు ఎరువులు, పురుగు మందుల పిచికారి కోసం రైతులు డ్రోన్లను ఉపయోగి స్తున్నారు. ఎకరానికి 300 నుంచి 500 రూపాయల వరకు డ్రోన్‌ ఆపరేటర్లు చార్జి చేస్తున్నారు. డ్రోన్‌ ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం తెచ్చిపెట్ట నుంది. స్వయం సహాయక గ్రూపులు నమో డ్రోన్‌ దీదీ కోసం వ్యవసాయ శాఖ లేదా కృషి విజ్ఞాన కేంద్రాలను సంప్రదించాలి.

నమో డ్రోన్‌ దీదీ లాభాలు

ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 15 వేల మహిళా గ్రూపులకు డ్రోన్లను అందించనున్నారు. ప్రతి డ్రోన్‌ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందజేస్తుంది. గరిష్టంగా రూ. 8 లక్షల వరకు డ్రోన్‌ కొనుగోలుపై సబ్సిడీ అందుతుంది. మిగతా డబ్బులను అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ఫండ్‌ ద్వారా 3 శాతం వడ్డీపై రుణం అందజేస్తారు. పథకానికి ఎంపికైన సంఘ సభ్యులకు డ్రోన్‌ నడిపేందుకు శిక్షణ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో డ్రోన్‌ను సంఘాలకు అందజేస్తారు. డ్రోన్‌ శిక్షణ కోర్సును డీజీసీఏ అంగీకరిస్తుంది. రైతులకు డ్రోన్‌ ద్వారా సేవలందించేందుకు వ్యవసాయ శాఖ మహిళా సంఘాలకు మద్దతు ఇస్తుంది. డ్రోన్‌ తయారీ దారులు, శిక్షణ సంస్థలు, వ్యవసాయశాఖ కూడా సంఘాలకు సహకారం అందిస్తాయి.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

associationsDroneswomen

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు పాఠశాల స్థాయి నుంచే ఏఐ పరిజ్ఞానం.. మిజోరం కొత్త ప్రయోగం