08/11/2026, Sunday · 03:08:40 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 5:02 PM అనకాపల్లి 20

తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో  ఓటుకు నోటు తిరస్కరణ
Want this news as a newspaper clip?Print News Clip
  • 1998లో ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రలోభాలకు దూరం గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ సుమారు రూ.12 వేల నగదు తిరస్కరణ

అనకాపల్లి జిల్లా, మునగపాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఓటు హక్కు విలువ విషయంలో రాజీపడకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకుంటున్నారు సామాజికవేత్త, సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త బొడ్డేడ జగ్గఅప్పారావు. తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఆయనకు తెలియకుండా తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు రూ.500 అందించారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గఅప్పారావు ఆ నగదును స్వీకరించకుండా సంబంధిత పార్టీ అభ్యర్థికి తిరిగి అందజేశారు. వ్యక్తిగతంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓటు విలువను డబ్బుతో ముడిపెట్టకూడదనే తన నిర్ణయాన్ని ఆచరణలో చూపించారు. 1998 నుంచి ఓటుకు నోటు దూరం 1998లో ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఓటు కోసం డబ్బు తీసుకోకుండా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటూ ఓటుకు నోటుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వివిధ సందర్భాల్లో సుమారు రూ.12,000 ప్రలోభపు నగదును తిరస్కరిచారు.
సుమారు 30 సంవత్సరాలుగా వినియోగదారుల హక్కులు,సమాచార హక్కు చట్టం, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత చెస్ శిక్షణ, తదితర రంగాల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఓటుకు నోటు వ్యతిరేకంగా ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. ఓటు అనేది కేవలం వ్యక్తిగత హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే పౌర బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఓటర్లు డబ్బు, బహుమతులు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :: యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి

Thotada MPTCRefusalnotevoteZPTCelections

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు