08/11/2026, Sunday · 03:00:15 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 1:14 PM అంతర్జాతీయం 8

అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా పనిచేస్తున్న హ్యారీ బాక్సర్ అలియాస్ హరిచంద్ జాట్‌ను అమెరికాలో అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో అమెరికా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్ అండ్ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్ అందించిన సమాచారంతో అతడిని అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని, అమెరికా నుంచి అతను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. అలాగే బాలీవుడ్ నటులను చాలా మంది అతను సోషల్ మీడియా, ఆడియో మెసేజీలలో బెదిరించాడని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని జుహు ప్రాంతంలో ఫిల్మ్‌మేకర్ రోహిత్ శెట్టి నివాసంపై జరిగిన కాల్పుల్లో తన హస్తం ఉందని బాక్సర్ ప్రకటించాడు. అలాగే, నటుడు తుషార్ కపూర్‌ను ఒక ఆడియోలో బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ ఆడియోలో ఉన్న గొంతు బాక్సర్‌ది కాదని అధికారులు చెప్పారు.

బాక్సింగ్ నుంచి నేర సామ్రాజ్యంలోకి

హ్యారీ బాక్సర్ అసలు పేరు హరిచంద్ జాట్. అతనిది రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్‌రోర్ జిల్లా. జైపూర్‌లో ఉన్నపుడు బాక్సింగ్ నేర్చుకున్నాడు. దీంతో అతనికి బాక్సర్ అనే పేరు వచ్చింది. అలాగే కొన్నాళ్లపాటు బాక్సింగ్ కోచ్‌గా పనిచేశాడు. వివిధ పోటీ పరీక్షలకూ ప్రిపేర్ అయ్యాడు. తర్వాత నేర ప్రపంచంలోకి ప్రవేశించాడు. అయితే అతను విదేశాలకు ఎప్పుడు వెళ్లాడో స్పష్టమైన సమాచారం లేదు. విదేశాల్లో ఉంటూనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలకంగా పనిచేస్తున్నాడు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో జరిగిన వివిధ నేరాల్లో అతని హస్తం ఉంది. అలాగే కెనడాలోని కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెఫే పైనా కాల్పుల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. అతడిని త్వరలో భారత్‌కు తీసుకురానున్నారు

ఇదీ చదవండి :: స్నేహితుడి కూతురు తిరస్కరించిందని వివాహితుడి ఆత్మహత్య

associate arrestedLawrenceextraditedIndiasoon

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు పాఠశాల స్థాయి నుంచే ఏఐ పరిజ్ఞానం.. మిజోరం కొత్త ప్రయోగం