08/11/2026, Sunday · 03:00:17 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 1:49 PM వైఎస్సార్ కడప 9

జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం
Want this news as a newspaper clip?Print News Clip

కడప : కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసలను టీడీపీ కైవసం చేసుకుంది. పులివెందులలో 1,463 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించగా.. మైదుకూరులో 18,903 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ గెలుపొందారు.పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. వేంపల్లి మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీకి మాత్రమే ఎన్నిక జరిగింది. అలిరెడ్డిపల్లిలో కూడా 29 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అటు.. బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఓబులమ్మ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 8391 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.

కుప్పం నియోజకవర్గంలో బోణీ కొట్టని వైసీపీ

చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఇక ఎంపీటీసీ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. రామకుప్పం మండలం మనేంద్రం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి 712 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కుప్పం మండలం నడుమూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి 1166 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శాంతిపురం మండలం సి.బండపల్లి టీడీపీ అభ్యర్థి 718 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. మొరసనపల్లి టీడీపీ అభ్యర్థి 494 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇదీ చదవండి :: స్నేహితుడి కూతురు తిరస్కరించిందని వివాహితుడి ఆత్మహత్య

YCP PulivendulaJaganOwnIlakaShocksMaidukurZPTCsTDP

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు పాఠశాల స్థాయి నుంచే ఏఐ పరిజ్ఞానం.. మిజోరం కొత్త ప్రయోగం