08/11/2026, Sunday · 03:08:12 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎన్నికల రోజు విషాదాలు

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 10:14 AM అనంతపురము 10

ఎన్నికల రోజు విషాదాలు
Want this news as a newspaper clip?Print News Clip
  • విధుల్లో ఉన్న ఉపాధ్యాయినికి గుండెపోటు రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి.. గుండెపోటుతో చనిపోయిన టీడీపీ కార్యకర్త

ఉమ్మడి అనంతలో ఘటనలు పరిషత్‌ ఎన్నికల రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం ఇద్దరు గుండెపోటుతో, ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయిని హరిత గౌడు(57) గుండెపోటుతో మృతి చెందారు. ఈమె డి.హీరేహాళ్‌ మండలం కాదలూరు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆమెకు కూడేరు మండలం కడదరకుంటలో డ్యూటీ వేశారు. ఆమె బుధవారం రాత్రి ఎన్నికల సామగ్రితో కడదరకుంట చేరుకుని, అక్కడే బస చేశారు. గురువారం ఉదయం ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. కాసేపటికే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఏఎన్‌ఎం పరీక్షించి, ఆస్పత్రికి వెళ్దామన్నారు. ఉదయం 11.30కు కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి, అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు. కారు ఢీకొని వలస కూలీ మృతి

ఓటు వేసేందుకు స్వస్థలానికి వచ్చిన వలస కూలీ భాస్కర్‌ గౌడ్‌(46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన స్నేహితుడు వెంకప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి ఆర్‌ఎస్‌ సమీపంలో జరిగింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన భాస్కర్‌ గౌడ్‌(46) పనుల కోసం తెలంగాణ వెళ్లాడు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. గురువారం ఓటు వేశాక మిత్రుడు వెంకప్పతో కలిసి బైక్‌పై గుత్తి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా గుత్తి ఆర్‌ఎస్‌ వద్ద ఓ కారు అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొని, సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాన్ని బలంగా తాకింది. దీంతో స్తంభం విరిగి భాస్కర్‌గౌడ్‌, వెంకప్పల బైక్‌పై పడింది. భాస్కర్‌ గౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. టీడీపీ కార్యకర్త చివరి ఓటు

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన టీడీపీ కార్యకర్త పయ్యావుల రాఘవ(40) ఓటు వేశాక, ఇంటికి వెళ్లి గుండెపోటుతో మృతిచెందారు. రాఘవ గురువారం ఉదయం ఎంపీటీసీ-2 పరిధిలో ఓటు వేశారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన ఆయన.. ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఓటు వేసేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటకు చెందిన ఈదా దావీదురాజు(52) ఓటు వేసేందుకు వెళుతూ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక 29వ పోలింగ్‌ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతనిని మేడపాడు పీహెచ్‌సీకి, అక్కడి నుంచి పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఓటు వేసి.. తనువు చాలించిన టీడీపీ వీరాభిమాని

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు బీసీ కాలనీకి చెందిన కగ్గ తిరుపతిరావు (74) టీడీపీకి వీరాభిమాని. గురువారం ఓటు వేశాక పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకొచ్చి గ్రామస్థులతో మాట్లాడుతూ కుప్పకూలిపోయారు. వెంటనే 108 అంబులెన్స్‌లో గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

Day TragediesElection

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు