08/11/2026, Sunday · 03:18:50 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు?

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 2:01 PM చిత్తూరు 14

టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. సుధా రెడ్డి ఇదేం తీరు?
Want this news as a newspaper clip?Print News Clip

చంద్రగిరి: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ వేళ చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, సుధారెడ్డిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం తీరని ప్రశ్నిస్తున్నారు.చంద్రగిరిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో సుధారెడ్డి కూడా ఆయన వాహనాన్ని అనుసరిస్తూ అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన ఎక్కడికి వెళ్తే సుధారెడ్డి అటే వెళ్లడం గమనార్హం.చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరగాల్సిన సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్యటనలపై సుధారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే తాము కూడా వెళ్తామని స్పష్టం చేస్తూ హడావుడి చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కారును సుధారెడ్డి తన వాహనంతో వెంబడించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘నేను ఎస్కార్ట్‌.. చెవిరెడ్డి వెంటే ఉంటా.. ఆయన ఎక్కడికి వెళ్తే మా వాహనం కూడా అక్కడికే వెళ్తుంది’ అంటూ ఆమె కామెంట్స్‌ చేస్తూ చెవిరెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సహనం పాటించిన చెవిరెడ్డి

పోలింగ్‌ కేంద్రాల వద్ద పర్యటిస్తున్న సమయంలో ఎదురైన ఈ పరిణామాలపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంయమనం పాటించారు. ప్రత్యర్థి వర్గం నుంచి ఎదురైన సవాళ్లకు స్పందించకుండా తన పర్యటన కొనసాగించారు. మొత్తంగా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ నాయకులు, వారి అనుచరులు సంయమనం పాటించి ప్రశాంత పోలింగ్‌కు సహకరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి :: దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

Sudha ReddyTDPMLAwifeHalchal

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు