08/11/2026, Sunday · 03:08:43 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కురుపాం గురుకుల ఘటనపై ఏబీఎన్ కథనం.. స్పందించిన మంత్రి సంధ్యారాణి

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 10:36 AM పార్వతీపురం మన్యం 11

కురుపాం గురుకుల ఘటనపై ఏబీఎన్ కథనం.. స్పందించిన మంత్రి సంధ్యారాణి
Want this news as a newspaper clip?Print News Clip

పార్వతీపురం మన్యం, నవంబర్ 6: జిల్లాలోని కురుపాం గురుకుల పాఠశాల ఘటనపై ఏబీఎన్‌లో వచ్చిన కథనం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. విద్యార్థినుల అస్వస్థతపై స్పందించిన మంత్రి సంధ్యారాణి వెంటనే చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఏబీఎన్‌‌తో మంత్రి మాట్లాడుతూ.. మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో తక్షణం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కురుపాం గురుకుల విద్యార్థినులకు వైరల్ ఫీవర్స్ వల్లనే వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం పిల్లలందరి ఆరోగ్యం బాగుందని.. మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.కాగా.. కురుపాం గురుకుల పాఠశాలలో దాదాపు 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం వెంటనే విద్యార్థులను మాదలింగ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందజేశారు. గత ఏడాది ఇదే విద్యాసంస్థలో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు విద్యార్థినుల మృతి సంచలనం రేపింది.

ఇదీ చదవండి :: 60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

Rani reactsABNstoryKurupamGurukulincidentMinisterSandhya

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు