08/11/2026, Sunday · 03:08:16 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జేఎన్‌టీయూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 10:30 AM హైదరాబాద్ 10

జేఎన్‌టీయూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
Want this news as a newspaper clip?Print News Clip
  • తొలిసారి క్యూఎస్‌ జాబితాలోకి..
  • భవిష్యత్తులో మరింత మెరుగైన స్థానానికి చేరతాం
  • వీసీ కిషన్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: సాంకేతిక విద్యకు చిరునామాగా ఉన్న నగరంలోని జేఎన్‌టీయూకు తొలిసారి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రముఖ అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థల విశ్లేషణా సంస్థ క్వాక్వారెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) తాజాగా ప్రకటించిన ఆసియా ర్యాంకింగ్‌తో జేఎన్‌టీయూ అంతర్జాతీయ విద్యాసంస్థల సరసన చేరింది. ఆసియా దేశాల్లోని 3600కు పైగా విద్యాసంస్థలను విశ్లేషించిన క్యూఎస్‌ సంస్థ.. జేఎన్‌టీయూకు 1200-1300 బ్యాండ్‌లో ర్యాంకును ప్రకటించింది.జేఎన్‌టీయూకు తొలిసారి క్యూఎస్‌ ర్యాంకు లభించడంపై వైస్‌చాన్స్‌లర్‌ డాక్టర్‌ టి. కిషన్‌కుమార్‌ రెడ్డి, రెక్టార్‌ దామోదరం, రిజిస్ట్రార్‌ జయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై వీసీ మాట్లాడుతూ క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో తొలిసారి చోటు దక్కడం.. వర్సిటీలోని ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని చెప్పారు. అయితే, విశ్వ విద్యాలయం కొంత మేరకు ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల లేమి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిఽధులు మంజూరు కాకపోవడం..వంటి అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నదని, భవిష్యత్తులో వాటిన్నింటినీ అధిగమించి మరింత మెరుగైన స్థానానికి చేరేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

Worldwide RecognitionJNTU

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు