08/11/2026, Sunday · 03:08:41 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు తొమ్మిదేళ్లు

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 10:33 AM రాష్ట్ర వార్తలు 9

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు తొమ్మిదేళ్లు
Want this news as a newspaper clip?Print News Clip
  • నాడు ప్రజల కష్టాలు విన్నారు.. చూశారు
  • నేనున్నానంటూ భరోసా ఇచ్చారు
  • అధికారంలోకి రాగానే విప్లవాత్మక పథకాలు,కార్యక్రమాలతో ప్రజా సంక్షేమ పాలన
  • గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ఇంటి ముంగిటకే సేవలు
  • 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ బంద్‌
  • రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన.. ప్రజాస్వామ్యానికే పెనుముప్పు
  • వచ్చే ఏడాది మళ్లీ పాదయాత్ర చేస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌

 వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రజాసంకల్ప యాత్ర ఈనెల 6వ తేదీ (శుక్రవారం)తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొంది. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్సార్‌ సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో కోట్లాది మందిని కలిసి స్వయంగా వారి బాధలను విన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటూ భరోసా ఇచ్చారు.
134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఎండ, వాన, చలిని లెక్క చేయక అన్ని కాలాల్లోనూ జనం మధ్యే జగన్‌ విడిది చేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను కళ్లారా చూశారు. సొంత కాళ్లపై నిలదొక్కుకునే అవకాశాలు లేక తల్లడిల్లిన అక్కచెల్లెమ్మలను చూశారు. ప్రజలు చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితినీ గమనించారు.చెప్పింది చేసి చూపించారు
వైఎస్‌ జగన్‌ 2019లో అధికారంలోకి రాగానే కులం, మతం, రాజకీయం చూడకుండా వివక్ష లేని పాలనను అందించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే సేవలను తీసుకొచ్చారు. ఏకంగా 1.34 లక్షల ఉద్యోగాలను సృష్టించి రికార్డు స్థాయిలో నియామకాలు చేశారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్‌.. ప్రజలకు ఇంటి వద్దే సేవలందించారు. జగన్‌ పాలనలో గ్రామ స్వరాజ్యం సాక్షాత్కరించింది. పల్లెలకు కొత్త కళ వచ్చింది. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీల రూపేణా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూరాయి.
అమ్మఒడి, ఆరోగ్యశ్రీ బలోపేతం, ఆరోగ్య ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లిష్‌ మీడియం.. ఇలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు, కార్యక్రమాలకు గత ప్రభుత్వం వేదికైంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు అండ్‌ కో మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఈ పథకాలన్నీ బంద్‌.. రెడ్‌బుక్‌ పాలన మొదలైంది. అన్ని వర్గాల ప్రజలకూ కష్టాలే. ఏకంగా ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దగా పాలనకు వ్యతిరేకంగా వచ్చే ఏడాదిలో మళ్లీ పాదయాత్ర ఉంటుందని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి :: యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి

Sankalpa YatraNineyearsJaganPraja

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు