24న హనుమకొండలో కేటీఆర్ సభ

హనుమకొండ: ఈనెల 24న హనుమకొండలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుంట్ల తారకరామారావు (కేటీఆర్) పాల్గొననున్న సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. సభ నిర్వహణకు అనువైన స్థలాల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలిపారు. భారీ జన సమీకరణతో సభను నిర్వహించి పార్టీ శ్రేణు ల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు రాజకీయంగా తమ బలాన్ని చాటుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు.సభ నిర్వహణకు సంబంధించి హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానం, కాకతీయ ప్రభుత్వ కళాశాల (కేడీసీ) క్రీడా మైదానాలను బీఆర్‌ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్ పరిశీలించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా పార్కింగ్ స్థలాలకు సంబంధించి ఇ ప్పటికే రెండుచోట్ల అధికారుల నుంచి అను మతులు తీసుకున్నట్లు సమాచారం. కేటీఆర్ సమక్షంలో ఓ ప్రైవేటు విద్యాసంస్థల అధినేత సుమారు 10 వేల మందికి పైగా కార్యకర్తల తో చేరనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్












