08/11/2026, Sunday · 03:08:28 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరింపు.. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 4:01 PM సంగారెడ్డి 9

డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరింపు.. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
Want this news as a newspaper clip?Print News Clip

సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిన్న (గురువారం) అర్ధరాత్రి NH- 65పై వాహనాలు ఆపిన వారిని టార్గెట్ చేస్తూ ఈ ముఠా చోరీలకు పాల్పడిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. పూణేలో చోరీ చేసిన బైకుతో నిందితులు దొంగతనాలు చేస్తున్నారు. అక్టోబరు 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హైవేపై నాలుగు చోట్ల చోరీలను ఈ గ్యాంగ్ చేసింది.సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కోహిర్, చిరాగ్‌పల్లిలో ఆగి ఉన్న వాహనాల్లోని వారిని డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరించి నగలు, డబ్బులను కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు. కర్ణాటకలోని హుమ్నాబాద్ వద్ద కూడా నిందితులు దారి దోపిడీ చేశారు. మడ్గి చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో కేటుగాళ్లు పట్టుబడ్డారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పరారీలో ఉన్నాడని ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

gang arrestedThreateningdummygunknivesinterstaterobbery

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు