08/11/2026, Sunday · 03:34:28 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 3:59 PM హైదరాబాద్ 8

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై చర్చించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ముంపు ప్రభావం, నీటి లభ్యతపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు కేటాయించాలని, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదులకు అదనంగా 0.6 టీఎంసీల నీరు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు నీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పంప్‌హౌస్‌లు, పంపులు, ఇతర వ్యవస్థల పనులు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Key OrdersRevanthThummidihettiBarrage

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు