08/11/2026, Sunday · 03:08:29 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ధరణి భూ అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 15 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో సోదాలు

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 11:38 AM హైదరాబాద్ 5

ధరణి భూ అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు.. 15 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో సోదాలు
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : ధరణి భూ రికార్డుల అక్రమాల వ్యవహారంపై సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా 15 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ అధికారులు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, గజ్వేల్, భువనగిరి ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు.ధరణి పోర్టల్‌లో భూ రికార్డులను అక్రమంగా మార్చడం, భూముల వివరాల్లో తారుమారు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా భూ లావాదేవీలకు సహకరించడం వంటి ఆరోపణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో పలువురు ధరణి ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా భూదాన్ భూములకు సంబంధించిన బై నెంబర్లలో జరిగిన అక్రమ మార్పులు, భూ రికార్డుల మాయంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలక ఆధారాలు.. అసలు సూత్రధారుల కోసం సీఐడీ వేట..

ధరణి భూ అక్రమాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సీఐడీ అధికారులు సాంకేతిక ఆధారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో పలు కీలక డిజిటల్ ఆధారాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌లో భూ రికార్డులను ఎవరు మార్చారు? ఎప్పుడు మార్పులు చేశారు? ఎవరికి లబ్ధి చేకూరేలా ఈ అక్రమాలకు పాల్పడ్డారు? అనే కోణాల్లో అధికారులు ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ధరణి ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తుల పాత్రతో పాటు ఈ వ్యవహారంలో వారికి సహకరించిన ఇతర వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుల విచారణ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భూదాన్ భూముల బై నెంబర్ల వ్యవహారంలో జరిగిన అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ అక్రమాల ద్వారా ఎంతమేర భూముల రికార్డులను తారుమారు చేశారు? అనే అంశాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. అక్రమాలకు పాల్పడిన ప్రధాన వ్యక్తులను గుర్తించి వారి పాత్రను నిర్ధారించే దిశగా అధికారులు వేట కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

Concurrent searchesCIDlightningraidsDharanilandirregularitiesspecial

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు