08/11/2026, Sunday · 03:08:40 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సరికొత్త చరిత్ర.. యూఎస్ కాంగ్రెస్‌కు 102 మంది డెమోక్రటిక్ మహిళలు

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 4:09 PM జాతీయం 9

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సరికొత్త చరిత్ర.. యూఎస్ కాంగ్రెస్‌కు 102 మంది డెమోక్రటిక్ మహిళలు
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: తాజాగా జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం విషయంలో సరికొత్త చరిత్ర లిఖితమైంది. మొట్టమొదటిసారి వందమందికిపైగా డెమోక్రటిక్ మహిళలు ఆ దేశ కాంగ్రెస్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో రిపబ్లికన్ మహిళా ప్రాతినిధ్యం మాత్రం తగ్గుముఖం పట్టింది. వాషింగ్ టన్ పోస్ట్ ప్రకారం ఇప్పటికే 102 మంది డెమోక్రటిక్ మహిళలు మిడ్‌టర్మ్ ఎన్నికల్లో విజయం సాధించారు. మరోవైపు రిపబ్లికన్ మహిళలు కేవలం 16 స్థానాలకే పరిమితం అయ్యారు. ఇంకా కొన్ని స్థానాల్లో ఫలితాలు తేలలేదు. అవి కూడా కలిపితే ఈ సంఖ్య 20కు చేరే అవకాశముంది. అలాగే ఎన్నికైన డెమోక్రటిక్ మహిళల సంఖ్య కూడా పెరగొచ్చు.అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం మేర ఉంటుందని ఓ అంచనా. ఆ దేశ చరిత్రలోనే ఇంత మంది స్త్రీలు కాంగ్రెస్‌కు ఎన్నికవడం ఇదే తొలిసారి. ప్రాతినిధ్యం పెరిగినా.. అమెరికాలో మహిళల జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. ఆ దేశ మొత్తం జనాభాలో 51 శాతం మహిళలున్నారు. కానీ హౌస్‌లో వీరి ప్రాతినిధ్యం 30 శాతమే ఉంది.

కాగా 2026 మధ్యంతర ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. 15 మంది స్త్రీలు గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. జార్జియా రాష్ట్రానికి తొలి నల్లజాతి మహిళా గవర్నర్‌గా కీషా లాన్స్‌ బాటమ్స్‌ ఎన్నికవడం మరో విశేషం. ఈ విజయాలు అమెరికాలో మహిళా ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోందనడానికి ఉదాహరణలని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

midterm electionshistoryDemocraticwomenCongress

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు