08/11/2026, Sunday · 03:08:40 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రభుత్వ పథకాల లబ్ధికి ఓటర్ ఐడీ.. బీజేపీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 4:02 PM జాతీయం 11

ప్రభుత్వ పథకాల లబ్ధికి ఓటర్ ఐడీ.. బీజేపీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Want this news as a newspaper clip?Print News Clip

న్యూఢిల్లీ: కేంద్రంలో శాశ్వతంగా అధికారంలో కొనసాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికలను తారుమారు చేసి ప్రజల ఓటు హక్కును హరించేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను నిర్ధారించడానికి ఆధార్ కార్డులకు బదులుగా ఓటర్ ఐడీ కార్డులను ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.ఆధార్‌కు బదులుగా ఓటర్ ఐడీ ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడం పౌరుల ప్రాథమిక హక్కులకు ముప్పు కలిగించవచ్చని ఎంపీ రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రయోజనాలను పొందడాన్ని ఓటర్ల జాబితాలతో ముడిపెడుతున్నారని, అయితే ఆ జాబితాలను ఇప్పటికే తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించే లేదా విమర్శించే లక్షలాది మంది పేర్లను తొలగించడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరాకరించే పరిస్థితి ఏర్పడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియను ఆపకపోతే ఓటర్ల జాబితా నుంచి మరిన్ని పేర్లు తొలగించే అవకాశం ఉందని ఆరోపించారు. వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్న ప్రజలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుందన్న రాహుల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పాత్రనూ ప్రశ్నించారు. 'ఓటర్ల జాబితాలు నిష్పక్షపాతంగా వ్యవహరించే ఎన్నికల సంఘం చేతిలో ఉండాలి. కానీ, ఇప్పుడు అవి మోదీ ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్ కుమార్ చేతిలో ఉన్నాయి. ఓట్ల చోరీలో బీజేపీతో కుమ్మక్కైన ఆయనను ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఎల్లప్పుడూ బీజేపీకే మెజారిటీ వచ్చేలా జాబితాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే జాబితా మీకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయో లేదో నిర్ణయిస్తుంది. ఇది హైజాక్ చేయబడిన ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లేదు, ప్రభుత్వమే తనకు అనుకూలమైన వ్యక్తులను ఎన్నుకుంటోంది' అని రాహుల్ విమర్శించారు.

కాగా, రాహుల్ గాంధీ షేర్ చేసిన వీడియోలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ మాట్లాడుతూ.. 'ఇకపై లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల చెల్లింపుల కోసం ఆధార్ కార్డు ప్రాతిపదికగా ఉండదు. ప్రతి వీధిలోని సంస్థల్లో ఇప్పుడు ఆధార్ కార్డు అందుబాటులో ఉంది. వారిని అడిగితే చాలు, ఐదు నిమిషాల్లో మీకు ఆధార్ కార్డును సిద్ధం చేసి ఇస్తారు. కాబట్టి, ఇకపై ఆధార్ కార్డు ప్రాతిపదిక కాదు. లబ్ధిదారులందరికీ చెల్లింపుల కోసం బయోమెట్రిక్, ఓటర్ ఐడీ (EPIC) నంబర్ ప్రాతిపదికగా ఉంటాయి. వాటి ఆధారంగానే చెల్లింపులు జరుగుతాయి' అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

lashes outRahulGandhiBJPVoterbenefitinggovernmentschemes

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు