నెలరోజులపాటు సూపర్‌స్టార్ జన్మదిన వేడుకలు

చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ జన్మదిన వేడుకలను ఈ నెల 12 నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ 75 యేళ్ల వయస్సులో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడాన్ని చూసి వీరాభిమానిగా తానెంతో గర్వపడుతున్నానని, ఆ హిట్‌తో పాటు 76వ జన్మదినాన్ని కలిపి ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నానన్నారు.రజనీ సమక్షంలో ఈ నెల రోజుల పండుగ జరపాలన్నది తన కోరికని, అయితే రజనీ ఇలాంటి ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి కనుక అభిమానులతో కలిసి వేడుకలు జరుపనున్నామని చెప్పారు. చిన్నప్పటినుండి సూపర్‌స్టార్‌ను నాయకుడిగా ఆరాధిస్తున్నానని, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండటానికి, తనకు లభించిన కీర్తిప్రతిష్ఠలకు ఆయనే కారణమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు












