08/11/2026, Sunday · 03:18:52 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జైలులో కలిశారు.. ముఠాగా ఏర్పడ్డారు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 4:52 PM పశ్చిమ గోదావరి 16

జైలులో కలిశారు.. ముఠాగా ఏర్పడ్డారు
Want this news as a newspaper clip?Print News Clip
  • 1020 కేజీల వైర్లు చోరీ
  • ఆరుగురు నిందితుల అరెస్టు

ఏలూరు క్రైం గ్లోబల్ వార్త: వారంతా జైలుల్లో ఒకరి కొకరు పరిచయం అయినవారే. వారందరిపై వివిధ తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత కొంతకాలం నుంచి అర్ధ రాత్రి వేళ పొలాల్లోకి వెళ్ళి రైతుల పంటలకు నీళ్ళు అందించడానికి మోటా ర్లకు విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్లను వారు టార్గెట్‌ చేసుకున్నారు. ఒకొక్క ట్రాన్స్‌ఫరాన్ని 30 నిముషాల నుంచి 40 నిముషాలలోపు పగుల గొట్టేసి దానిలో ఉన్న రాగి వైరును అపహరిస్తున్నారు. ట్రాన్స్‌ఫా ర్మర్‌ను పగులగొట్టేందుకు మూడంచెల పద్ధతిలో వారు కాపలా కూడా పెటు ్టకోవడం విశేషం. విద్యుత్‌ సరఫరా ఉన్న ఒక ఇనుప చైన్‌ను ఆ వైర్లపైకి వేసి బ్రేక్‌ డౌన్‌ చేసి క్షణాల్లో ట్రాన్స్‌ఫరానికి వచ్చే విద్యుత్‌ వైర్లను కట్‌ చేసేస్తున్నారు. తిరిగి కరెంటు వచ్చేలోపే ఈ పనిని చేసేస్తున్నారు. ఇక ట్రాన్స్‌ఫరాన్ని 30 నిముషాల వ్యవధిలో పగులగొట్టేస్తున్నారు. ఈ పనిచే యడానికి కారు, ఒక మోటారు సైకిల్‌ అవసరమైన టూల్‌ కిట్లను విని యోగిస్తున్నారు. ఇలాంటి ముఠా ఏకంగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లా ల్లోని 35 వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫరాలను ధ్వంసం చేసి 1020 కేజీల వైర్లను తస్కరించిన ఆరుగురు సభ్యుల ముఠాను లక్కవరం పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈముఠా వివరాలను వెల్లడించారు. లక్కవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పొలాలపై ఉన్న వ్యవసాయ ట్రాన్స్‌ఫారాలను పగులగొట్టి రాగివైరు అపహరించుకుపోయారని ఫిర్యాదు అందడంతో లక్కవరం ఎస్‌ఐ జబీర్‌ కేసు నమోదు చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్‌, లక్కవరం ఎస్‌ఐ జబీర్‌ వారి సిబ్బంది కలిసి మంగళవారం ఉదయం ఏలూరు రోడ్డులోని గురవాయి గూడెం గ్రామ సమీపంలో జీడిగింజల ఫ్యాక్టరీ వద్ద వాహనాల తనిఖీలు చేప ట్టారు. ఈ తనిఖీల్లో ఎపీ 05డిఎల్‌3333 గల క్రిటా కారు, ఒక మోటారు సైకిల్‌ను ఆపగా అందులో ఉన్న ఐదుగురు వ్యక్తు లు, ఒక బాలుడు పారిపోవడానికి ప్రయ త్నించగా అదుపులోకి తీసుకున్నా రు. ఆ కారులో రాగివైరు, పలు వస్తువులు ఉన్నాయి. దీంతో వారిని విచారించారు. ద్వారకాతిరుమల మండలం కూర్ల లక్ష్మీ పురం గ్రామానికి చెందిన కోడూరు రవితేజ (28)పై జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీటు ఉంది. గతంలో నకిలీ నోట్ల చలామణి, చీటింగ్‌ కేసులు, హత్యా కేసులు, దోపిడీ కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32పైగా కేసులు ఉన్నాయి. చింతలపూ డికి చెందిన చుండ్రు అనిల్‌కుమార్‌ (27)పై గతంలో పది ట్రాన్స్‌ఫరాలు పగులగొట్టిన కేసులు ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం రాముడుకుంట చెరువునకు చెందిన అన్నెంలోకేష్‌ (19), పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన దగ్గుపల్లి జోగ మారేష్‌ (22)పై గతంలో గణపవరం పోలీస్‌ స్టేషన్‌లో రెండు గంజాయి కేసులు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన మువ్వా జగన్‌ (22), మరో చట్టంతో విబేధించిన బాలుడు (15)లను అరెస్టు చేశారు. కోడూరి రవితేజ హత్యాయత్నం కేసులో ఏలూరు జిల్లా జైలులో ఉండగా వీరందరిని పరిచయం చేసుకుని ఆతరువాత ట్రాన్స్‌ఫరాలను సులువుగా పగులగొట్టి వాటిలో ఉన్న రాగి వైర్లను అపహరించి వాటిని విక్రయిస్తూ సొమ్ములు చేసుకు ంటున్నా రు. వీరందరిని అరెస్టు చేసి వెయ్యి 20 కేజీల రాగివైరు (10 లక్షల విలువ), కారు, మోటారు సైకిల్‌, ట్రాన్స్‌ఫరాన్ని పగులగొట్టడానికి ఉపయోగించే టూల్‌ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూ డెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8 ట్రాన్స్‌ఫారాలు, లక్కవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధి లో 8 ట్రాన్స్‌ఫారాలు, నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 15 ట్రాన్స్‌ఫా రాలు, కొయ్యలగూడెం స్టేషన్‌ పరిధిలో రెండు ట్రాన్స్‌ఫారాలు, దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 1 ట్రాన్స్‌పారాలు, భీమడోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధి లో 1 ట్రాన్స్‌ఫారం పగులగొట్టి రాగివైరు అపహరించారని ఎస్పీ వివరించారు. నేరస్తులను అరెస్టు చేసిన జంగారెడ్డిగూడెం సీఐ ఎంవి సుభాష్‌, ఎస్‌ఐలు జబీర్‌,ఎన్‌ వీర ప్రసాద్‌, ఏఎస్‌ఐ ఎన్‌వీ సంపత్‌కుమార్‌, జంగారెడ్డిగూడెం కానిస్టేబుళ్ళు ఎన్‌.రమేష్‌, ఎస్‌కె షాన్‌బాబులను ఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

gang formedMetjail

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు