08/11/2026, Sunday · 03:19:10 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏపీలో మురసు తుఫాన్ బీభత్సం.. 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంట నష్టం

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 2:04 PM రాష్ట్ర వార్తలు 17

ఏపీలో మురసు తుఫాన్ బీభత్సం.. 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంట నష్టం
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి : ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంతో 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుపాన్‌కు కారణంగా అత్యధికంగా పంటలు దెబ్బతినట్లు గుర్తించారు. వ‌రి, ప‌త్తి, మొక్కజొన్న పంట‌ల‌కు బాగా న‌ష్టం వాటిల్లింద‌ని అధికారులు అంచనా వేశారు. 15 జిల్లాల్లోని 132 మండ‌లాల్లో సాధార‌ణ స్థాయికంటే మించి ముర‌సు తుఫాన్ ప్రభావం చూపినట్లు అంచనాకు వచ్చారు.ఇక.. తుఫాన్ తీరం దాటే సమయంలో మార్కాపురం జిల్లా డోర్నాల వ‌ద్ద గంట‌ల‌కు 107 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ముర‌సు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో 10,805 మందిని అధికారులు పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. మొత్తం 171 పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు.. 14,810 ఆహార పొట్లాలను సరఫరా చేశారు. 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 13 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాల‌ను స‌హాయ‌క చర్యలకు తరలించారు. 613 జనరేటర్లను అధికారులు సిద్ధం చేశారు. తుఫాన్ స‌మ‌యంలో కూలిన చెట్లను, నిలిచిపోయిన నీళ్లను తొల‌గించ‌డానికి అగ్నిమాప‌కద‌ళ బృందాల త‌ర‌లించారు. చెట్లు తొల‌గించ‌డానికి 185 బృందాలను సిద్ధం చేశారు.

తుఫాన్ వచ్చే ముందే 3066 మంది గ‌ర్భిణుల‌ను, 1008 బాలింత‌ల‌ను సుర‌క్షిత‌మైన ఆసుప‌త్రుల‌కు అధికారులు తరలించారు. 13 జిల్లాల్లో 725 వైద్య బృందాల‌ను వైద్య ఆరోగ్యశా తరలించింది. అత్యవసర సేవ‌ల కోసం 362 అంబులెన్సులు సిద్ధం చేశారు. 3.77 కోట్ల మంది మొబైల్ ఫోన్లకు తుఫాన్ హెచ్చరికల సందేశాలను నిరంతరం జారీ చేసి అప్రమత్తం చేశారు. తుఫాన్ అత్యవసర సహాయం కోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల సదుయాన్ని ఆర్టీజీఎస్ కల్పించింది.

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

tuphan bibhatsamepilomurasujillallohektarlalopamta

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు