08/11/2026, Sunday · 03:08:43 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

దొంగ ఓట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?.. వైసీపీపై మంత్రి ఆనం ఫైర్

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 2:21 PM వైఎస్సార్ కడప 15

దొంగ ఓట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?.. వైసీపీపై మంత్రి ఆనం ఫైర్
Want this news as a newspaper clip?Print News Clip

నెల్లూరు : స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తోందని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు.నెల్లూరులో ఓసీ మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడమే టీడీపీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.12,400 కోట్ల నిధుల కేటాయింపులు జరిగాయని, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నామినేషన్ల సమయంలోనే అభ్యర్థులను బెదిరించేవారని, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరులో వైసీపీ పది వార్డులు గెలుచుకున్నా తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు.అనంతసాగరం పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేయించారని.. మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి వందమంది అనుచరులతో వచ్చి బూత్ క్యాప్చర్‌కు ప్రయత్నించారని ఆనం ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు. తన అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దని.. సుప్రీంకోర్టుకు లాగుతాననే హెచ్చరికలకు భయపడనని విక్రమ్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సంయమనంతో వ్యవహరిస్తున్నానని, తన సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు.

ఇదీ చదవండి :: సమాజంలో గౌరవం పొందాలంటే.. వీటిని ఫాలో కావాలి

anam phairdomgaotluvestumtechustuurukovalavaisipipaimamtri

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు