08/11/2026, Sunday · 03:08:41 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

లాస్ ఏంజెలెస్ మేయర్‌ నిత్యకు శశిథరూర్ కంగ్రాట్స్

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 10:55 AM జాతీయం 11

లాస్ ఏంజెలెస్ మేయర్‌ నిత్యకు శశిథరూర్ కంగ్రాట్స్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతి మహిళ నిత్యా రామన్ ఎన్నికవడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ లో అభినందించారు. అలాగే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఎన్నికను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికాలోని రెండు పెద్ద నగరాలకు భారత సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని ఆయన కొనియాడారు. ‘తిరువనంతపురం బిడ్డ నిత్యా రామన్ ఇప్పుడు లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. భారత్‌లో ఉన్న మేయర్ల కన్నా మమ్దానీ, నిత్య గొప్పగా పనిచేస్తారని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌లో ఉన్న మేయర్ల వ్యవస్థపైనా ఆయన పలు విమర్శలు చేశారు. భారతదేశంలో ఉన్న మేయర్లు బ్రిటిష్ కాలం నాటి పాత వ్యవస్థ వల్ల ఎలాంటి అధికారం, బడ్జెట్ లేక నిస్సహాయులుగా మిగిలిపోయారని పేర్కొన్నారు.కాగా.. భారత సంతతికి చెందిన, డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా మద్దతు ఉన్న సిటీ కౌన్సిలర్ నిత్యా రామన్ లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌ను ఆమె ఓడించారు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో నిత్యా రామన్‌కు తిరుగులేని ఆధిక్యం వచ్చింది. దీంతో బాస్ తన ఓటమిని అంగీకరించారు. ఇక లాస్ ఏంజెలెస్ 44వ మేయర్‌గా నిత్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్‌లో వెల్లడించారు. తనను మేయర్‌గా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ముందున్న పనులు కఠినమైనవని, మార్పు రావడానికి సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: సమాజంలో గౌరవం పొందాలంటే.. వీటిని ఫాలో కావాలి

Tharoor CongratsShashiMayorofLosAngeles

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు