08/11/2026, Sunday · 03:08:35 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 10:46 AM రాష్ట్ర వార్తలు 11

చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరిషత్ పోలింగ్
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురు మదురు సంఘటనలు మినహా పరిషత్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. యధావిధిగా ఉమ్మడి కడప జిల్లాలో ఘర్షణలకు వైసీపీ రెచ్చగొడుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలు తెరలేపారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. లింగాల మండలం పార్నపల్లెలో ఎంపీ అవినాశ్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ మూకల గొడవలకు దిగారని తెలుగుదేశం పార్టీ శ్రేణలు ఆరోపణలు గుప్పించారు.

పార్నపల్లెలో ప్రశాంతతను చెడగొట్టేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ ఫైర్ అయ్యింది. అటు తుమ్మలపల్లెలోనూ టీడీపీ నేతలపై వైసీపీ మూకలు దాడులకు యత్నిస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గం గండ్లకుంటలో వైసీపీ నేత జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి అరాచకం చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండ్లకుంటలోని పోలింగ్ బూత్లలో ఉన్న టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేత రామసుబ్బారెడ్డి బయటకు తోసేసారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.

తన సొంత గ్రామంలో టీడీపీ ఏజెంట్లు ఉండడానికి వీల్లేదని రామసుబ్బారెడ్డి చెప్పడం రచ్చకు దారి తీసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన కారణంగా అసహనంతో వైసీపీ దాడులకు కుట్ర చేస్తోందని కూటమి విమర్శలు గుప్పిస్తోంది. అయితే వైసీపీ మూకలు కవ్వించినా... సంయమనం పాటించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

ఇదీ చదవండి :: 'అక్టోబర్‌ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

polling exceptQuietParishadsporadicincidents

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు