08/11/2026, Sunday · 03:34:29 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆర్నబ్ తుపాను కష్టాల్లో ఏపీకి అండగా తమిళనాడు

భవ్య జర్నలిస్ట్ 30/10/2026 10:39 AM రాష్ట్ర వార్తలు 32

ఆర్నబ్ తుపాను కష్టాల్లో ఏపీకి అండగా తమిళనాడు
Want this news as a newspaper clip?Print News Clip

తుపాను అర్నబ్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. తుపాను సృష్టించిన విధ్వంసం, విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, లైన్లు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులకు అదనపు సిబ్బంది, సామగ్రి అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని మంత్రి గొట్టిపాటి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. ఏపీకి విద్యుత్ సిబ్బందితో పాటు అవసరమైన సామగ్రిని పంపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే తెలంగాణ సాయం..
ఆర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విద్యుత్ పునరుద్ధరణ పనులకు సహాయం అందించాలని కోరింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని మరమ్మతు పనుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు తమిళనాడు నుంచి కూడా సిబ్బంది, సామగ్రి అందుబాటులోకి వస్తే సహాయక చర్యలు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Nadu SupportsTamilCycloneArnabDifficulties

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు