08/11/2026, Sunday · 03:08:40 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అనంతపురం, కర్నూలు కౌంటింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 10:49 AM అనంతపురము 6

అనంతపురం, కర్నూలు కౌంటింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి
Want this news as a newspaper clip?Print News Clip

అనంతపురం : అనంతపురం, కర్నూల్ జిల్లాలోని ఆలూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యేలు, రాజకీయనాయకులు ఉండడం వల్ల.. కౌంటింగ్ పారదర్శకంగా కొనసాగదని పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.అనంతపురం జిల్లాలోని అనంతపురం కౌంటింగ్ హాల్ దగ్గర పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరులు ఉండడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే ఆత్మకూరులో జెడ్పీటీసీ అభ్యర్థికి సంబంధించిన ఓట్ల లెక్కింపులో.. తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నయనతరెడ్డి కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండడం ఏంటని పలువురు రాజకీయ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. వీరు కౌంటింగ్ హాల్‌లో ఉంటే.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటూ.. ఎమ్మెల్యే పరిటాల సునీత.. ఎస్పీ జగదీష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించగా.. ఇరువర్గాల వారు పరస్పరం దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

Police lathichargeTensionAnantapurKurnoolcountingcentres

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు