08/11/2026, Sunday · 03:19:04 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

2.2 లక్షల ట్యాంకర్లు.. అక్టోబర్‌లో బుకింగ్‌ల సంఖ్య

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 10:26 AM హైదరాబాద్ 11

2.2 లక్షల ట్యాంకర్లు.. అక్టోబర్‌లో బుకింగ్‌ల సంఖ్య
Want this news as a newspaper clip?Print News Clip
  • గతేడాది అదే నెలలో కేవలం 87వేలే

హైదరాబాద్‌ సిటీ: సాధారణంగా వేసవిలో నెలకు ట్యాంకర్ల బుకింగ్‌లు రెండు లక్షల పైగా ఉంటాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్‌బోర్డు చరిత్రలోనే తొలిసారిగా అక్టోబరు నెలలో 2.2 లక్షల ట్యాంకర్లు బుక్‌ అయ్యాయి. గతేడాది ఇదే నెలలో 87 వేల ట్యాంకర్లే బుక్‌ కావడం గమనార్హం. ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు పెరగక పోగా ఎండల తీవ్రతతో రోజురోజుకు పడిపోతున్నాయి.దీంతో అక్టోబరు నెల నుంచే ప్రతీరోజు 7వేలకు పైగా ట్యాంకర్లు బుక్‌ అవుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, టీఎన్‌జీఓ్‌స కాలనీ ప్రాంతాల్లో వేసవి మాదిరిగానే ప్రతీరోజు ఒక్కో ఫిల్లింగ్‌ స్టేషన్‌కు 250 నుంచి 300 వరకు ట్యాంకర్లు వెళ్తున్నాయి. వాస్తవానికి వర్షాకాలంలో ట్యాంకర్లకు డిమాండ్‌ ఉండదు. 1500 నుంచి 2వేల లోపు మాత్రమే ప్రతీరోజు బుక్‌ అయ్యేవి. కానీ ఎల్‌నినో నేపథ్యంలో పరిస్థితులు భిన్నంగా మారాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో బోర్లు పోయడం లేదు. కొన్ని ఆగి పోస్తున్నాయి. మరికొన్ని పూర్తిగా బంద్‌ అయ్యాయి. అపార్ట్‌మెంట్‌, ఇతర అవసరాలకు నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లను బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

tankers NumberlakhbookingsOctober

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు