08/11/2026, Sunday · 03:28:42 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో ఐదేళ్ల కుమారుడిని చంపిన తండ్రి

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 1:11 PM హైదరాబాద్ 14

హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో ఐదేళ్ల కుమారుడిని చంపిన తండ్రి
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకునే హత్య చేశాడో కసాయి తండ్రి. బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శిల్పినగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. తండ్రి విద్యాసాగర్.. ఐదేళ్ల బాలుడి గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. బోరబండలో జీవిస్తున్న విద్యాసాగర్, దుర్గ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్తుండగా.. విద్యాసాగర్ మద్యానికి బానిసగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి కూడా విద్యాసాగర్ ఫుల్‌గా మద్యం సేవించి.. తన ఐదేళ్ల కొడుకు గొంతునులిమి దారుణానికి పాల్పడ్డాడు.ఆ సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా కుమారుడు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. విషయం తెలిసిన స్థానికులు వెంటనే బోరబండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు విద్యాసాగర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి :: బ్యాలెట్ బాక్సులో గ్రామ సమస్యల స్లిప్పులు.. పల్నాడులో ఆసక్తికర సన్నివేశం

old sonHyderabadFatherkillsfiveyeardrunkenbrawl

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు