08/11/2026, Sunday · 03:08:16 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 10:55 AM జాతీయం 6

సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్‌‌ను సీబీఎస్ఈ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. పదో తరగతి పరీక్షలు మార్చి 9న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9న ముగిసిపోతాయని వెల్లడించింది. పరీక్షల డేట్ షీట్ల కోసం విద్యార్థులు cbse.gov.in. వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

పదో తరగతి మేజర్ పేపర్ల తేదీలు..

ఫిబ్రవరి 17 - మ్యాథమేటిక్స్ స్టాండర్ట్/బేసిక్

ఫిబ్రవరి 22 - సైన్స్

ఫిబ్రవరి 26 - ఇంగ్లిష్ (కమ్యూనికేటివ్, ల్యాంగ్వేజ్ అండ్ లిటరేచర్)

మార్చి 3 - హిందీ కోర్స్ ఏ అండ్ బీ

12వ తరగతి మేజర్ పేపర్ల తేదీలు

ఫిబ్రవరి 16 - ఫిజిక్స్, 23న అకౌంటెన్సీ, 25న జాగ్రఫీ, 27న కెమిస్ట్రీ, మార్చి 2న సైకాలజీ, 5న ఇంగ్లిష్ ఎలెక్టివ్, ఇంగ్లిష్ కోర్, 9న మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, 13న హిందీ ఎలెక్టివ్, కోర్, 16న ఎకనామిక్స్, 19న పొలిటికల్ సైన్స్, 20న ఏఐ, 25న బయోలజీ, 27న హిస్టరీ, 30న సోషియాలజీ, 31న కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఏప్రిల్ 1న బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే సీబీఎస్ఈ 10, 12వ తరగతి నమూనా పేపర్‌ను బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.in. ద్వారా ఆ పేపర్‌ను చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఇదీ చదవండి :: యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి

Schedule ReleasedCBSEExam

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు