08/11/2026, Sunday · 03:19:05 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఢిల్లీ వ్యాపార సంఘాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 2:06 PM జాతీయం 19

ఢిల్లీ వ్యాపార సంఘాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: నిరసనకారుల ఆందోళనల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఢిల్లీలోని వ్యాపార సంఘాల వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. ఆందోళనలను నిర్వహించేవారిని ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీలో సుదీర్ఘ నిరసనలపై కేంద్ర ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది నిరసనల వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని.. పండుగల సీజన్‌లో ఆందోళనల వల్ల కన్నాట్ ప్లేస్ (CP) వ్యాపారాలు దెబ్బతిన్నాయని.. 50 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వ్యాపారాల సంఘాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి. కాగా.. పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసనకారులను, ఆందోళన నిర్వహించే వారిని పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని.. వారి పేర్లను కూడా పిటిషన్‌లో చేర్చాలని సూచించింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రాథమిక హక్కుల పేరుతో నిరసన ప్రాంతాలను.. నిరవధికంగా ఒక్కరే ఆక్రమించలేరు. ఇతరుల ఆవేదననూ గుర్తించాలి. సమాజంలో ఇతరులకు కూడా.. తమ సమస్యలపై గళమెత్తే హక్కు ఉంటుందని గుర్తించాలి’ అని వ్యాఖ్యానించింది. కాగా.. మాస్ డిటెన్షన్లు, పోలీసు బలప్రయోగాలు, మెట్రో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారణ చేసిం

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

kilaka vyakhyaludhillivyaparasamghalapitishanpaisuprimkortu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు