08/11/2026, Sunday · 03:28:45 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

దియా మిర్జా వీడియోపై బీజేపీ అభ్యంతరం.. వీడియో డిలీట్

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 3:44 PM జాతీయం 26

దియా మిర్జా వీడియోపై బీజేపీ అభ్యంతరం.. వీడియో డిలీట్
Want this news as a newspaper clip?Print News Clip

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చి కాలుష్యానికి కారణం కావద్దని బాలీవుడ్ నటి దియా మిర్జా చేసిన వీడియోను బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. ఆ వీడియోపై ముంబై బీజేపీ అధ్యక్షుడ అమీత్ సాతం తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో బీఎంసీ ఆ వీడియోను డిలీట్ చేసింది. అయితే, ఇతర సెలబ్రిటీలు మాధురీ దీక్షిత్, అజింక్య రహానె, మరాఠీ యాక్టర్ నిషిగంధా వాద్‌ల వీడియోలు మాత్రం అలాగే ఉన్నాయి. హిందూ పండుగలు ఎలా జరుపుకోవాలో సెలబ్రిటీలతో చెప్పించాల్సిన అవసరం లేదని అమీత్ సాతం అన్నారు. ‘మన పండుగలు ఎలా జరుపుకోవాలో మనకు ఎవరూ పాఠాలు చెప్పక్కర్లేదు. మన సంప్రదాయాలు మన సంస్కృతిలో బాగా పెనవేసుకుని ఉన్నాయి’ అని సాతం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ తర్వాత ఆ వీడియోను బీఎంసీ తొలగించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చవద్దని అంతకుముందు దియా మీర్జా ఒక వీడియో చేశారు.కాగా.. ముంబైలో కాలుష్యం పెరుగుతోందని, ముఖ్యంగా పండుగల సమయంలో ఇంకా తీవ్రం అవుతోందని, కాలుష్యం కట్టడిలో బీఎంసీ విఫలమైందని బాంబే హైకోర్టు అంతకుముందు బీఎంసీకి చీవాట్లు పెట్టింది. కాలుష్యం కట్టడికి సెలబ్రిటీలతో ప్రచారం చేయించాలని, కాలుష్యం తగ్గింపునకు వారితో అవగాహన కల్పించాలని సూచించింది. దీంతో హైకోర్టు సూచనను బీఎంసీ పాటించింది. బాణసంచా కాలిస్తే వెలువడే కాలుష్యంపై పలువురు సెలబ్రిటీలతో అవగాహన కల్పిస్తూ వీడియోలు చేయించింది. అలాగే పబ్లిక్ రోడ్లు, పార్కులు, బహిరంగ స్థలాల్లో బాణసంచా కాల్చడంపై బాంబే హైకోర్టు నిషేధం విధించింది.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

BJP objectionsDiaMirzadeleted

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు