08/11/2026, Sunday · 03:18:57 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్..

భవ్య జర్నలిస్ట్ 05/11/2026 3:07 PM జాతీయం 14

‘ప్రతిసారీ ఫెయిల్.. ప్రతిసారీ కొత్త సాకు’.. రాహుల్ గాంధీపై సీఎం యోగి సెటైర్స్..
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తొలగించండి’ పాదయాత్రలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, పార్టీ పదాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పాదయాత్ర అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో ఎదురవుతున్న వైఫల్యాలకు బాధ్యత తీసుకోకుండా ప్రతిసారీ కొత్త కారణాలు వెతుక్కుంటున్నారంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ పరిస్థితి పదేపదే పరీక్షల్లో ఫెయిలవుతూ, ప్రతిసారీ తన వైఫల్యానికి కొత్త సాకు చెప్పే గ్రామీణ విద్యార్థిలా తయారైందని ఎద్దేవా చేశారు.తన విమర్శలకు ఆసక్తికరమైన ఉదాహరణను జోడిస్తూ.. సీఎం యోగి ఓ కథను సభలో వివరించారు. ఒక గ్రామంలో ఓ విద్యార్థి పదేపదే పరీక్షల్లో ఫెయిల్ అవుతుంటాడని.. అయితే ప్రతిసారీ తన వైఫల్యానికి వేర్వేరు కారణాలు చెబుతుంటాడని పేర్కొన్నారు. మొదటిసారి ఫెయిలైనప్పుడు మాస్టారు తన జవాబు పత్రాన్ని మార్చేశారని చెబుతాడని.. రెండోసారి పరీక్షలో సిలబస్‌కు సంబంధం లేని ప్రశ్నలు వచ్చాయని సాకు చెబుతాడని వివరించారు. మూడోసారి పెన్నులో సిరా అయిపోయిందని.. నాలుగోసారి తన ముందు కూర్చున్న విద్యార్థి వేగంగా రాయడం వల్ల తన దృష్టి మరలిందని చెప్పుకుంటాడని వ్యంగ్యంగా వివరించారు. ఈ కథ ద్వారా రాహుల్ గాంధీ రాజకీయ వైఖరిని.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రతి ఓటమికి కొత్త కారణాలు వెతుక్కోవడం కాకుండా, వైఫల్యాలకు బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు.

ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

time failexcuseYogiSettersRahulGandhi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు