08/11/2026, Sunday · 03:08:30 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 3:57 PM జాతీయం 13

కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి భారీగా పుంజుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 227 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయాయి. అయితే ఆ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాల్లోకి మారాయి. మధ్యాహ్నం 2:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,265.64 పాయింట్లు పెరిగి 80,575.65 వద్ద కదలాడుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 323 పాయింట్లు లాభపడి 24,860 వద్ద ట్రేడవుతోంది (Sensex Today).

సెన్సెక్స్, నిఫ్టీ50 లాభాల్లోనే కదలాడుతున్నప్పటికీ మిడ్, స్మాల్ క్యాప్స్ విభాగాలు మాత్రం ఉదయం నుంచి నష్టాల్లోనే సాగుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం భారత ఈక్విటీ మార్కెట్లలో సుమారు రూ.15,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దాదాపు ఆరేళ్లలో ఇదే అతిపెద్ద ఒకరోజు నికర కొనుగోలుగా నిలిచింది. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు స్టాక్ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. అలాగే యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతుండడంతో నిఫ్టీ బ్యాంక్ సూచీ దాదాపు 1.6 శాతం పెరిగింది (Stock Market Today).

కొన్ని కంపెనీల మెరుగైన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. అలాగే ఇటీవల మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్న పెద్ద కంపెనీల షేర్లలో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడంతో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి సహా పలు ఆసియా మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ట్రేడయ్యాయి. అయినప్పటికీ భారత మార్కెట్లు విదేశీ పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో పుంజుకోవడం గమనార్హం (FII Buying).

కాగా, మార్కెట్‌లో భారీ రికవరీ కనిపించినప్పటికీ సమీప కాలంలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు (Crude Oil Prices). నిఫ్టీ ఇండియా వోలటిలిటీ ఇండెక్స్ (ఇండియా విక్స్) 10.53 శాతం పెరిగి 17.22కు చేరుకోవడం మార్కెట్‌లో అనిశ్చితిని సూచిస్తోంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, ముడి చమురు ధరలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు తదుపరి ట్రేడింగ్ సెషన్లలో కీలకంగా మారనున్నాయి.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

Sensex risesOngoinggainspoints

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు