08/11/2026, Sunday · 03:34:32 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రామమందిరం విరాళాల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 2:34 PM జాతీయం 19

రామమందిరం విరాళాల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు
Want this news as a newspaper clip?Print News Clip

న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరం విరాళాల కేసులో దాఖలైన పిటిషన్ల విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు వెలువరించింది.విరాళాల చోరీ కేసు ట్రయల్‌లో స్థానిక కోర్టుకు సాయపడేందుకు రిట్ పిటిషనర్లకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం నిందితుడికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సాధారణ కేసు కాదని పేర్కొంది. ఇందులో కొంత ప్రజా ప్రయోజన అంశం కూడా ఇమిడి ఉందని తెలిపింది. అందువల్ల కోర్టుకు సహకరించేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నామని పిటిషనర్లకు ధర్మాసనం వివరించింది.

జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టుకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. విరాళాల కేసులో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక మేజిస్ట్రేట్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. రామమందిరం నిర్మించే స్థలంపై సరిహద్దుల పునః పరిశీలన కోరుతూ దాఖలైన నూతన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

mugimchina suprimkorturamamamdiramviralalakesuvicharana

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు