08/11/2026, Sunday · 03:08:36 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. 1,718 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 4:23 PM జాతీయం 10

స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. 1,718 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిశాయి. గురువారం రెండు వేల పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్ శుక్రవారం 1700 పాయింట్లకు పైగా పెరుగుదల నమోదు చేసింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లకు అనుకూల ఫలితాలు రావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే చమురు సరఫరా, ధరలపై ఒత్తిడి తగ్గుతుందనే ఆశలు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి (Stock Market Today).గత కొన్ని రోజులుగా భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. గురువారం ఒక్కరోజే వారు సుమారు రూ.14,975 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దాదాపు ఆరేళ్లలో ఇదే అతిపెద్ద ఒకరోజు కొనుగోలుగా నిలిచింది. అలాగే పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం కూడా మదుపరుల విశ్వాసాన్ని పెంచుతోంది. ముఖ్యంగా పెద్ద కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అలాగే విదేశీ పెట్టుబడుల రాక, దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు భారత మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ స్టాక్ ఐదు శాతం లాభపడింది (Indian Stock Market Rally).

శుక్రవారం ఉదయం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది (November 6 Stock Market). చివరకు 1718 పాయింట్ల లాభంతో 81,028 వద్ద రోజును ముగించింది. అలాగే నిఫ్టీ 493 పాయింట్ల లాభంతో 25,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25,000 పాయింట్లను దాటడం మార్కెట్‌కు సానుకూల సంకేతం. అయితే ఈ స్థాయి పైన నిలదొక్కుకోవడం కీలకం. కాగా, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం స్వల్ప నష్టాలతోనే రోజును ముగించాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.93.91గా ఉంది...

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

Sensex RisesPointsStockMarket

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు