08/11/2026, Sunday · 03:08:35 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురి మృతి

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 12:39 PM జాతీయం 11

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురి మృతి
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన స్కూటీని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్న వారిపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.లారీ ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడగా.. ఘటనాస్థలం వద్ద హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖుంటి సదర్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని పాకో దేవి, కసిలా దేవి, మన్హు దేవి, గోలు కుమార్, అంజలి కుమారి, తూటీ కుమారి, సౌరభ్ నాయక్‌గా గుర్తించారు. ఒకే ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

పరారీలో లారీ డ్రైవర్..

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట స్కూటీ ప్రమాదం ఎలా జరిగింది? ఆ తర్వాత లారీ అక్కడున్న జనాలపైకి ఎలా దూసుకొచ్చింది? డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

Seven killedlorryoverturnsJharkhand

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు