08/11/2026, Sunday · 03:08:33 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 4:05 PM జాతీయం 10

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాడు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సూర్యకుమార్ కుటుంబంతో ప్రధాని మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ముఖ్యంగా సూర్యకుమార్ పిల్లలతో మోదీ సరదాగా గడపడం ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం సందర్భంగా అందుకున్న బంగారు పతకాన్ని ధరించి ఈ సమావేశంలో కనిపించాడు (PM Modi Meets Suryakumar Yadav).సూర్యకుమార్ యాదవ్ మెడల్‌ను ప్రధాని మోదీ చేతిలోకి తీసుకుని పరిశీలించారు. ప్రపంచకప్ విజయాన్ని గుర్తుచేసుకుంటూ ఇద్దరూ ప్రత్యేక క్షణాలను పంచుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో సూర్యకుమార్ కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి మరోసారి ప్రపంచ విజేతగా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ సమావేశంలో సూర్యకుమార్ కుమార్తె రిద్దిమా ప్రధాని మోదీ ముందు భక్తి గీతం ఆలపించింది. చిన్నారి పాటను మోదీ ఆసక్తిగా విన్నారు (PM Modi Diwali Meeting).సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో గడిపిన క్షణాలను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. దీపావళి పండుగ వాతావరణంలో అయోధ్యలో రాముడి రాక, సరయూ నది ప్రాధాన్యం ఈ ఏడాది వేడుకలకు మరింత పవిత్రతను తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి :: యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి

Yadav meetsSuryakumarModispendstimechildren

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు