08/11/2026, Sunday · 03:28:43 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు...

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 5:05 PM శ్రీ సత్యసాయి 9

జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు...
Want this news as a newspaper clip?Print News Clip

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు...

శ్రీ సత్యసాయి జిల్లాలో జెడ్పీటీసీ, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొత్తచెరువులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించారు. పుట్టపర్తి డీఎస్పీ మాణిక్యరావు పర్యవేక్షణలో సీఐలు రాజశేఖర్, యువరాజ్‌తో పాటు పోలీస్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహించారు.

నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరంతర నిఘా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అమలులో ఉన్న ఆంక్షలకు సహకరించాలని, అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే కేంద్రాల్లోకి ప్రవేశించాలని కోరారు. అనవసరంగా గుమిగూడటం, వాగ్వాదాలు, ఘర్షణలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.

ఎన్నికల సమయంలో బెదిరింపులకు పాల్పడినా, రాజకీయ ఘర్షణలకు కారణమైనా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :: బ్యాలెట్ బాక్సులో గ్రామ సమస్యల స్లిప్పులు.. పల్నాడులో ఆసక్తికర సన్నివేశం

police presenceStrongZPTCNominationCentre

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు