08/11/2026, Sunday · 03:34:27 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

భవ్య జర్నలిస్ట్ 30/10/2026 1:50 PM రాష్ట్ర వార్తలు 18

విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
Want this news as a newspaper clip?Print News Clip

నవంబర్ 1న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బంది.. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 29, 30 తేదీల్లో బ్యాలెట్ పద్దతిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు విజయవాడ కలెక్టర్ లక్ష్మీశ ఆ జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.నవంబర్ ఒకటో తేదీన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే డైరెక్షన్స్‌ని వాళ్లకి తెలియచేస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ప్రాపర్‌గా ప్రిపేర్ అవుతున్నాం. సెన్సిటివ్, క్రిటికల్ గ్రామాలను ముందుగానే గుర్తించాము. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశాం. ప్రతి ఊర్లో బందోబస్తును ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ద్వారా మీకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకోండి’ అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

Ballot VotingQuietPostalVijayawada

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు