08/11/2026, Sunday · 03:08:34 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

బావమరిది మెడ కొరికాడు!

భవ్య జర్నలిస్ట్ 07/11/2026 11:47 AM అనంతపురము 5

బావమరిది మెడ కొరికాడు!
Want this news as a newspaper clip?Print News Clip

అనంతపురం జిల్లా యాడికిలో ఘటన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశాడన్న కోపంతో సొంత బావమరిదిపై వైసీపీ అభ్యర్థి దాడిచేశాడు. అతడి మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులో శుక్రవారం జరిగింది. రాయలచెరువు ఎంపీటీసీ-1 స్థానానికి వైసీపీ తరఫున మాదాల జనార్దన్‌ బరి లో దిగారు. ఆయన బావమరిది మోటుపల్లి రవి సహా బంధువులందరూ వైసీపీకి కాకుండా, టీడీపీతరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వారిపై జనార్దన్‌ అక్కసు పెంచుకున్నాడు.

పోలింగ్‌ పూర్తయినప్పటి నుంచి పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పట్టణంలోని మెడికల్‌ స్టోర్‌ వద్ద తన బంధువుల్లో ఒకరైన మోటుపల్లి మనోహర్‌ కనిపించగా.. జనార్దన్‌ దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఆయన సొంత బావమరిది మోటుపల్లి రవి అడ్డుకోవడంతో అతడిపై దాడికి దిగాడు. బావమరిది మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అతడిని పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. రవికి ఆరుకుట్లు పడ్డాయి. జనార్దన్‌ పారిపోయి ఒక కాంప్లెక్స్‌లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న రవి బంధువులు, మద్దతుదారులు అక్కడికి వెళ్లి జనార్దన్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

his neckBrotherlawbitten

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు