బంగ్లాదేశ్‌లోని వీడియో అమరావతిదని ప్రచారం

వాస్తవాలతో ఎండగట్టిన లోకేశ్ ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారాన్ని మంత్రి లోకేశ్ వాస్తవాలతో ఎండగట్టారు. బంగ్లాదేశ్‌లో నీట మునిగిన ప్రాంతాల వీడియోని అమరావతిలో ప్రాంతాలంటూ వైసీపీ నేతలు ప్రచారం చేయడంపై లోకేశ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఫొటోలతోసహా వివరిస్తూ... ‘నిజం గడపదాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్న నానుడి వైసీపీ ఫేక్ ముఠాలకు వర్తిస్తుంది. తప్పుడు ప్రచారాలతో అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్












