08/11/2026, Sunday · 03:44:25 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

న్యాయ విభాగము జిల్లా కోర్ట్/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 6:50 PM వైఎస్సార్ కడప 9

న్యాయ విభాగము జిల్లా కోర్ట్/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
Want this news as a newspaper clip?Print News Clip
  • బోర్డ్ ఆఫ్ విజిటర్స్ కమిటీ ఆధ్వర్యంలో కడప కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారాల తనిఖీ మరియు మొక్కలు నాటడం జరిగింది”

బోర్డ్ ఆఫ్ విజిటర్స్ కమిటీ చైర్మన్, గౌరవ జిల్లా ప్రధాన న్యాయాధికారి జి .రామ గోపాల్ వారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కడపలోని కేంద్ర కారాగారం మరియు మహిళా ప్రత్యేక కారాగారాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సందర్శనలో భాగంగా కమిటీ సభ్యులు కారాగారాల్లోని ఖైదీల రూమ్ లు, వంటశాలలు, హాస్పిటల్, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, ఖైదీలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఖైదీలు వివిధ వృత్తి నైపుణ్యాల ద్వారా తయారు చేస్తున్న వస్తువులు, వాటి తయారీ ప్రక్రియ, చేపడుతున్న పనుల వివరాలను పరిశీలించి, ఈ కార్యకలాపాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఖైదీల న్యాయపరమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిటీ, వారి కేసులకు సంబంధించి హైకోర్టులో దాఖలైన అప్పీళ్లు, వాటి ప్రస్తుత స్థితిగతుల గురించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంది. ఖైదీలకు న్యాయ సహాయం అందుబాటులో ఉన్న తీరు, న్యాయపరమైన పరిష్కారాల కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది.
ఈ సందర్భంగా ఖైదీల హక్కుల పరిరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్య సంరక్షణ, న్యాయ సహాయం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. ఈ తనిఖీ కార్యక్రమం ద్వారా కారాగారాల్లోని సౌకర్యాలు, ఖైదీల సంక్షేమం, న్యాయపరమైన అంశాలపై సమగ్రంగా వివరాలు సేకరించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప శ్రీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ వారు, గౌరవ ఫర్ డిస్ట్రిక్ కలెక్టర్ కం డి.ఆర్.ఓ శ్రీ కె.మల్లికార్జునుడు, డి.యం.హెచ్.ఓ శ్రీ యుగంధర్, పి.డబ్ల్యూ.డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ పి.చెంగలరాయుడు, డి.ఈ.ఓ డా.ఎస్.షంషుద్దీన్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ సి.లక్ష్మి నారాయణ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శ్రీ ఎ.సురేష్ కుమార్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ యం.సుబ్రమణ్యేసు రావు, పురుషుల మరియు ప్రత్యేక మహిళ కారాగారముల సూపరింటెండెంట్ లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, పారా లీగల్ వాలంటరీలు మరియు ఖైదీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

న్యాయ విభాగము జిల్లా కోర్ట్/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
న్యాయ విభాగము జిల్లా కోర్ట్/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

Service AuthorityLegalDepartmentDistrictCourt

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు