08/11/2026, Sunday · 03:08:29 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వై.ఎస్.ఆర్. కడప జిల్లా....

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 1:19 PM వైఎస్సార్ కడప 10

వై.ఎస్.ఆర్. కడప జిల్లా....
Want this news as a newspaper clip?Print News Clip
  • జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
  • ➡️ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ.. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా
  • జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్.

కడప: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద DFMD (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్)ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని, కేంద్రాలకు సమీపంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా పోలీసు పెట్రోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.

కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతి పొందిన అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని, వారు విధిగా ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. గెలుపొందిన, ఓటమి చెందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంయమనం పాటించాలని, ఎలాంటి ఘర్షణలకు, కవ్వింపు చర్యలకు పాల్పడరాదని సూచించారు.

కౌంటింగ్ రోజున జిల్లాలో మద్యం విక్రయాలు నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, BNSS సెక్షన్ 163 అమలులో ఉంటాయని, నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా సంచరించడం, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తప్పుడు ప్రచారం చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం సహించేది లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

Kadapa DistrictYSR

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు