08/11/2026, Sunday · 03:44:22 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 12:49 PM హైదరాబాద్ 10

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
Want this news as a newspaper clip?Print News Clip

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరవు పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరవు అంటూ ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినోపై వాతావరణ నిపుణులు ముందస్తుగా హెచ్చిరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ పోస్ట్...

‘కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!! జూన్ 01, 2026 నుంచి ఈరోజు వరకు 750 టీఎంసీల గోదావరి నీళ్లను, 250 టీఎంసీల కృష్ణా నీళ్లను దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్. కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా పట్టించుకోలేదు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా కృష్ణా నీళ్లను వృథా చేశారు. ఎల్‌నినో వస్తుందని ఈ ఏడాది మార్చ్ నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

government responsibleCongressdroughtTelanganaKTR

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు