08/11/2026, Sunday · 03:28:46 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సైబర్ మోసగాళ్ల వలలో కానిస్టేబుల్.. అధిక లాభాల పేరుతో రూ.29 లక్షలు టోకరా

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 1:08 PM హైదరాబాద్ 19

సైబర్ మోసగాళ్ల వలలో కానిస్టేబుల్.. అధిక లాభాల పేరుతో రూ.29 లక్షలు టోకరా
Want this news as a newspaper clip?Print News Clip

హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ ఓ కానిస్టేబుల్.. అధిక లాభాలు వస్తాయన్న ఆశతో పెట్టుబడి పెట్టి రూ. 29 లక్షలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసముంటున్న శ్రీకాంత్.. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూంటారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్‌లో సుకన్యరెడ్డి అనే అమ్మాయి పరిచయమైంది. కొద్ది రోజుల స్నేహం తరువాత.. సుకన్యరెడ్డి శ్రీకాంత్‌ను సంప్రదించి డార్విన్ ఎక్స్ గ్లోబల్ యాప్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికింది. దీంతో శ్రీకాంత్.. విడతల వారీగా రూ. 29 లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నప్పటికీ.. డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మరో రూ.12 లక్షలు కట్టాలని సుకన్యరెడ్డి షరతు పెట్టింది. దీంతో మోసపోయానని గ్రహించిన కానిస్టేబుల్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :: బ్యాలెట్ బాక్సులో గ్రామ సమస్యల స్లిప్పులు.. పల్నాడులో ఆసక్తికర సన్నివేశం

Fraudsters WebConstableCyberLakhsTokaraNameHigherProfits

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు