08/11/2026, Sunday · 03:34:34 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఇంటి లోన్‌ తీర్చడానికి.. మరో ఇంటికి కన్నం!

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:44 AM హైదరాబాద్ 17

ఇంటి లోన్‌ తీర్చడానికి.. మరో ఇంటికి కన్నం!
Want this news as a newspaper clip?Print News Clip
  • రూ.1.80 కోట్ల విలువైన బంగారం అపహరణ
  • రూ.15 లక్షల నగదు కూడా..
  • ఇంటి లోన్‌ తీర్చడానికి దొంగతనం..

 ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన లోన్‌ తీర్చడానికి ఇబ్బందులు ఎదురవడంతో.. నమ్మకంగా పనిచేసిన ఇంటికే కన్నం వేశాడో ఘనుడు. ఇంట్లో అందరూ ఊరెళ్లిన విషయం తెలుసుకొని నకిలీ తాళం చెవితో.. ఇంట్లోకి ప్రవేశంచి రూ.1.80 కోట్ల విలువైన 1.180కేజీల బంగారం, రూ.15లక్షల నగదు దోచుకొని ఉడాయించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని మారేడుపల్లిలో చోటుచేసుకుంది.డీసీపీ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్‌ మారేడుపల్లి నెహ్రూనగర్‌లోని వెంకటసాయి రెసిడెన్స్‌లో ఉంటున్న డాక్టర్‌ ఆచి మోహన్‌ దంపతుల ఇంట్లో బోడుప్పల్‌కు చెందిన వెలిశాల భరత్‌ కొన్నేళ్లుగా కార్పెంటర్‌ పనులు చేస్తున్నాడు. ఇంటి యజమానులతో మంచి పరిచయం ఏర్పడింది. ఆ చనువుతో వారు అతనికి మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఇంటికి సంబంధించిన విషయాలను పంచుకునేవారు.

ఇంటి లోన్‌ తీర్చడానికి దొంగతనం..

భరత్‌ బోడుప్పల్‌లో తన ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రూ.40 లక్షల రుణం తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో రుణం తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో డాక్టర్‌ ఆచీ మోహన్‌ దంపతుల ఇళ్లు గుర్తుకొచ్చింది. వారి ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, రూ.లక్షల్లో నగదు ఉంటుందని తెలుసుకున్న అతడు వారి ఇంటికి కన్నం వేసి చోరీ చేయాలని భావించాడు. అనుకూలమైన సమయం కోసం వేచి చూశాడు. ఈనెల19న వారు తమ సొంత ఊరైన ఖమ్మం జిల్లా ఇల్లందుకు వెళ్లారు.

ఇదే అనుకూలంగా భావించిన భరత్‌.. నకిలీ తాళం చెవితో డాక్టర్‌ మోహన్‌ ఇంట్లోకి ప్రవేశించాడు. బెడ్‌రూమ్‌లోని ఆల్మారాను తెరచి అందులో ఉన్న రూ1.80కోట్ల విలువ చేసే 1.180 కేజీల బంగారు ఆభరణాలతో పాటు రూ.15 లక్షల నగదును చోరీ చేసి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన దంపతులు బీరువా తెరిచి ఉండడం చూసి అవాక్కయ్యారు. మారేడుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీమ్‌, టెక్నికల్‌ టీమ్‌ సేకరించిన ఆధారంగా ఇంట్లో పనిచేసిన భరత్‌ను అనుమానించారు. అతడిని అంబర్‌పేట్‌లో అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

repaythe loanofhousefind

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు