08/11/2026, Sunday · 03:19:10 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

భవ్య జర్నలిస్ట్ 03/11/2026 3:39 PM ఖమ్మం 22

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం
Want this news as a newspaper clip?Print News Clip

ఖమ్మం జిల్లా : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను ఏలి పేదోళ్ల కష్టాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వారి స్వార్థానికి, స్వలాభానికి రాష్ట్ర సొత్తును ఆ దొరలు కొల్లగొట్టి, ప్రజలను పేదవాళ్లుగా చేశారని ఆగ్రహించారు. ఈరోజు ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ తెల్దారుపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

మరిన్ని ఉద్యోగాలను కల్పిస్తాం..

పొర్లు దండాలు పెట్టుకుంటూ ప్రతిపక్షాల నేతలు తమ ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో రైతులు వరి సాగు వేస్తే ఉరే అన్నారని.. తమ ప్రభుత్వం అన్నదాతలు పండించిన పంటకు బోనస్ ఇచ్చి ఆదుకుందని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదింటికి సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తోందని వెల్లడించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. ఇప్పటికే 74 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మళ్లీ మరిన్ని ఉద్యోగాలను కల్పిస్తామని భరోసా కల్పించారు.

అన్ని గ్రామాల్లో భూసర్వే చేయాలి..

రాష్ట్రంలో 8 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకు ఇచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. 120 సంవత్సరాల క్రితం భూముల సర్వేలు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి అంగుళం సర్వే చేసి భూములు ఉన్న వారికి పూర్తి భరోసా కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో భూసర్వే చేయాలని కలెక్టర్‌ను ఆదేశించామని అన్నారు. మ్యాపులతో కూడిన సర్వేతో ఆధార్ ఎలా ఉందో.. భూదార్ కూడా అలానే ఉండేలా ప్రతి భూస్వామికి ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. విద్య, వైద్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

pomguleti dhvajamkesiarhayamlotelamganasottunukollagottarumamtri

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు