08/11/2026, Sunday · 03:18:55 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

డాక్టర్‌‌ను ఇంటికి పిలిచి చితకబాది 3.5 లక్షల దోపిడీ.. ఇద్దరు నటుల అరెస్టు

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 10:31 AM జాతీయం 11

డాక్టర్‌‌ను ఇంటికి పిలిచి చితకబాది 3.5 లక్షల దోపిడీ.. ఇద్దరు నటుల అరెస్టు
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: ఎమర్జెన్సీ పేరుతో డాక్టర్‌ను ఇంటికి పిలిచారు. తర్వాత ఆయనను చితకబాది మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.5 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు నటులు ఉన్నారు. కేరళలోని కోచిలో ఈనెల 2న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు యాక్టర్ అతుల్య చంద్ర, యాక్టర్ - ప్రొడ్యూసర్ బిబిన్ పెరుంబిలి, మరికొందరు ఓ డాక్టర్‌కు ఫోన్ చేసి ఒకరికి ఆరోగ్యం బాగా లేదని, ఎమర్జెన్సీ ఉందన్నారు. వెంటనే ఒక అపార్ట్‌మెంట్‌కు రావాలని చెప్పారు.డాక్టర్ కాసేపట్లో ఆ ఫ్లాట్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ 12 మంది ఉన్నారు. పెరుంబిలితో పాటు మిగతా వారు ఆయనపై దాడి చేశారు. తర్వాత డాక్టర్‌ను ఒక కుర్చీపై కూర్చోబెట్టి కడుపు, పక్కటెముకలపై కొట్టారు. అతుల్య చంద్ర ఆ డాక్టర్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లను లాక్కుంది. ‘నువ్వు (డాక్టర్) దొంగవి. నిన్ను చంపేస్తాం. మా బంధువుల్లో ఒకరిని రేప్ చేశావు. అంతేకాకుండా మాపైనే కేసు పెడతానని బెదిరించావు’ అని ఆ డాక్టర్‌ను ఆమె బెదిరించింది. తర్వాత ఎలాగోలా బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గాలిస్తున్నారు. ఈ దాడి వెనుక దోపిడీ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉద్దేశం అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

doctor homelakhrobberyactorsarrestedcalling

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు