08/11/2026, Sunday · 03:44:23 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పొగమంచు సీజన్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 10:46 AM జాతీయం 16

పొగమంచు సీజన్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
Want this news as a newspaper clip?Print News Clip

పొగమంచు సీజన్‌ రానున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన సంస్థలను కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించింది. లో విజిబిలిటీలో విమానాలు నడపగల అర్హత ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా విమానాలు ఉండేలా చూడాలని ఆ శాఖ సూచించింది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విమాన షెడ్యూళ్లను రూపొందించాలని పేర్కొంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు పొగమంచు సీజన్‌ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం పౌర విమానయాన శాఖ.. వివిధ విభాగాల అధికారులు, విమానయాన రంగ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించింది. విమానాల ఆలస్యం, రద్దు, సమయాల మార్పు వంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

విమానయాన సంస్థలు తమ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని, లగేజీ నిర్వహణను సమర్థంగా చేపట్టాలని, విమానాల టర్న్‌ అరౌండ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ సూచించింది. విమాన కార్యకలాపాల్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు ప్రయాణికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించింది. అలాగే విమానాల రద్దు, ఆలస్యం, బయలుదేరే సమయాల్లో మార్పులపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌లు, ఈ-మెయిల్‌ వంటి మార్గాలను వినియోగించాలని సూచించింది.

విమానయాన సంస్థలు నిబంధనలను పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించడంతో పాటు విమానాలు, సిబ్బంది సంసిద్ధతను తనిఖీ చేయాలని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) కు మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక లో విజిబిలిటీ పరిస్థితుల్లో విమానాశ్రయాల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), విమానాశ్రయ నిర్వాహకులకు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ (ఐఎల్‌ఎస్‌), రన్‌వే విజువల్‌ రేంజ్‌ (ఆర్‌వీఆర్‌) వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, విమానాశ్రయ ప్రాంగణంలో భద్రత, టెర్మినల్‌ సామర్థ్యం, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలని పేర్కొంది

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

key directivesCentreissuesairlinesfoggyseason

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు