08/11/2026, Sunday · 03:18:57 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.. వీడియో వైరల్

భవ్య జర్నలిస్ట్ 06/11/2026 12:30 PM జాతీయం 8

వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.. వీడియో వైరల్
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో మంగళవారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రాత్రి వేళ ఓ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన ఆగంతుకుడు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. కాందీవలీ వెస్ట్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వృద్ధురాలు తన ఫ్లాట్ తలుపు తీస్తుండగా డెలివరీ ఏజెంట్‌లా వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాటకలిపాడు. ఆమెను ఏవో ప్రశ్నలు అడిగాడు. వృద్ధురాలు అతడికి బదులిచ్చారు. ఈ క్రమంలో నిందితుడు అకస్మాత్తుగా ఆమె గొలుసు తెంపుకుని పారిపోయాడు. నిందితుడిని ప్రతిఘటించలేని నిస్సహాయస్థితిలో వృద్ధురాలు షాక్‌కు గురయ్యారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.బయటకు వెళ్లి వచ్చిన వృద్ధురాలు తన ఫ్లాట్ తలుపు తీస్తుండగా నిందితుడు చోరీ చేశాడని పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల వారి గురించి ఏదో అడుగుతూ ఆమెను ఏమార్చే ప్రయత్నం చేశాడని అన్నారు. వృద్ధురాలికి తనపై ఎలాంటి అనుమానం లేదని నిర్ధారించుకున్నాక అకస్మాత్తుగా ఆమె మెడలో గొలుసు తెంపుకుని పారిపోయాడని చెప్పారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

chain theftGoldoldladyneckviral

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు