08/11/2026, Sunday · 03:44:21 PM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మోదీ సీటులో ఎస్పీ పాగా.. వారణాసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పీ విజయం

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 2:28 PM జాతీయం 15

మోదీ సీటులో ఎస్పీ పాగా.. వారణాసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పీ విజయం
Want this news as a newspaper clip?Print News Clip

ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం సీటులో ఎస్పీ విజయం సాధించింది. అంతేకాకుండా ఆగ్రాలోని గెలుపొందింది. 5 గ్రాడ్యుయేట్, 6 టీచర్ నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్ నిర్వహించగా.. ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లను నిలబెట్టుకుంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రెండు చోట్ల విజయం సాధించింది. బీజేపీ నిలబెట్టుకున్న స్థానాల్లో మీరట్, బరేలీ-మొరాదాబాద్ టీచర్ల సీటు, లక్నో టీచర్స్ సీటు ఉన్నాయి. వారణాసి, ఆగ్రా టీచర్ల నియోజకవర్గాల్లో ఎస్పీ గెలుపొందింది. మొత్తం 11 ఎమ్మెల్సీ సీట్లకు బుధవారం లెక్కింపు ప్రారంభించారు. మీరట్-సహరన్‌పూర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్సీ దినేష్ గోయల్ గెలుపొందారు. ఎస్పీ అభ్యర్థి ప్రమోద్ సింగ్ భాటీపై 12,855 ఓట్లతో గోయల్ గెలుపొందారు. మీరట్ టీచర్ల నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి నితిన్ తోమర్‌పై బీజేపీ అభ్యర్థి శ్రీచంద్ శర్మ 13,241 ఓట్లతో విజయం సాధించారు.అలాగే బరేలీ-మొరాదాబాద్ టీచర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హరి సింగ్ ధిల్లాన్.. ఎస్పీ అభ్యర్థి హాజీ మొహమ్మద్ దానిష్ అక్తర్‌ను ఓడించారు. లక్నో టీచర్ నియోజకవర్గంలో సిటింగ్ బీజేపీ అభ్యర్థి ఉమేష్ ద్వివేదీ.. ఎస్పీ అభ్యర్థి సుశీల్ కుమార్‌పై గెలుపొందారు. కాగా.. వారణాసి టీచర్ నియోజకవర్గంలో ఎస్పీ సిటింగ్ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్.. బీజేపీ అభ్యర్థి ప్రమోద్ మిశ్రాను 4900 ఓట్ల తేడాతో ఓడించారు. ఆగ్రా టీచర్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి ఆకాష్ అగర్వాల్.. బీజేపీ అభ్యర్థి హరికిశోర్ తివారీపై విజయం సాధించారు. కాగా.. 5 గ్రాడ్యుయేట్, 6 టీచర్ నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్ నిర్వహించారు. 11 సీట్లలో 6 సీట్ల ఫలితాలు తేలగా.. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ

espi vijayammodisitulopagavaranasiemmelsiennikallo

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

917 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ వరంగల్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి పాకాల సరస్సులో దూకి తల్లి ఆత్మహత్య జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం దీపావళి తర్వాత తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రలు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎన్టీఆర్ స్వగ్రామంలో టీడీపీ బోణీ... నెల్లూరులో మేకపాటి కుటుంబానికి షాక్ గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. అమెరికాలో లారెన్స్ అనుచురుడి అరెస్టు.. త్వరలో భారత్‌కు తరలింపు మహిళా సంఘాలకు డ్రోన్లు కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు